News October 15, 2025

సిద్దిపేట: రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

image

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల కార్యక్రమాల్లో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థులకు ఆన్లైన్‌లో వ్యాసరచన పోటీల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Drugs Menace: ‘Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs’ అంశంపై 500 పదాల్లో రాసి పంపాలన్నారు.

Similar News

News October 15, 2025

MGU డిగ్రీ పరీక్ష ఫీజు.. 25 వరకు గడువు

image

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ ఆఖరు అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం రూ.100తో అక్టోబరు 27 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

News October 15, 2025

అంతరపంటగా ‘అనప’.. ఎకరాకు రూ.10వేల ఆదాయం

image

రబీలో వేరు శనగ, జొన్న, ఆముదం, కంది పంటల్లో అంతరపంటగా సాగు చేయడానికి అనపకాయలు అనుకూలం. 60-70 రోజులకు పూతకు వచ్చి 130 రోజుల్లో పంట కాలం పూర్తవుతుంది. ఎకరాకు 1-2KGలను 90*20సె.మీ దూరం ఉండేలా గొర్రు లేదా నాగలితో విత్తుకోవాలి. ఎకరాకు 8KGల నత్రజని, 20KGల భాస్వరం, 10KGల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు సాగు ఖర్చు రూ.1,500-2K, నికర ఆదాయం రూ.10K వరకు ఉంటుంది.

News October 15, 2025

MBNR: మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యేలు

image

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం బెంగుళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించారు.