News April 1, 2024

సిద్దిపేట: రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు

image

సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. అన్నపూర్ణ రిజర్వాయర్‌ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.84 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్‌ స్టోరేజీకి చేరి ఈ రిజర్వాయర్‌ ఎడారిని తలపిస్తుంది. రిజర్వాయర్‌ కింద పంటలు ఎండిపోవడంతో దేవుడా ఇదేం దుస్థితి అని రైతులు బోరున విలపిస్తున్నారు. రంగనాయక సాగర్‌ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్‌స్టోరేజీకి చేరింది.

Similar News

News September 9, 2025

MDK: కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేసీఆర్

image

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలు చేశామని అన్నారు.తన పుట్టక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ అన్నారు

News September 9, 2025

మెదక్: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్

image

టేక్మాల్ మండలం ధనురా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత, విద్య బోధన తదుపరి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడి పాటలు బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రియాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.