News December 24, 2025
సిద్దిపేట: ‘రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు’

సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పుల్లూరు మేనేజర్ ప్రదీప్ చెప్పారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లిస్తే జీవిత బీమా రూ.2 లక్షలు వర్తిస్తుందని తెలిపారు. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బస్టాండ్‌లో జాగృతి ఫౌండేషన్ విజయవాడ ఉమాశంకర్ కళాజాత బృంద సభ్యులు ఆర్థిక, డిజిటల్ పై అవగాహన కల్పించారు.
Similar News
News December 25, 2025
జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించే సింపుల్ చిట్కాలు!

జంక్ ఫుడ్ తినాలనే కోరిక మెదడు పనితీరు, ఒత్తిడి, నిద్రలేమితో ముడిపడి ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినాలి. రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి జంక్ ఫుడ్ వైపు మనసు మళ్లదు. ఒత్తిడి తగ్గించుకోవడం, కంటినిండా నిద్ర, నీళ్లు బాగా తాగడం, ఫుడ్ బాగా నమిలి తింటే క్రేవింగ్స్ అదుపులో ఉంటాయి. స్నాక్స్‌గా పండ్లు, డ్రై ఫ్రూట్స్ బెస్ట్.
News December 25, 2025
రోజుకు 4 లక్షల లడ్డూలు తయారీ: TTD ఛైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ విక్రయశాల, తయారీ విభాగాన్ని పరిశీలించిన ఆయన రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవం లడ్డూలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లడ్డూ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని, నాణ్యతతో పాటు క్యూలైన్‌లో వేచిచూడే సమయం తగ్గించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News December 25, 2025
వంటింటి చిట్కాలు

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.


