News April 4, 2025
సిద్దిపేట: రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో గల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐకేపీ సెంటర్‌లలోనే వరిధాన్యం కోనుగోలుకు అవసరమైన పాడి క్లీనర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 6, 2025
వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.
News November 6, 2025
ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.
News November 6, 2025
10 రోజుల్లో నష్టపరిహారం: వికారాబాద్ కలెక్టర్

NH-167 రోడ్డు విస్తరణలో కట్టడాలు (ఆస్తులు) కోల్పోతున్న వారికి 10 రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వాసితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే 107 మందికి చెందిన 55,114 స్క్వేర్ ఫీట్ల స్థల సేకరణకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ పాల్గొన్నారు.


