News February 8, 2025
సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
Similar News
News September 20, 2025
ADB: విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త

దసరా పండుగ నేపథ్యంలో అన్ని బస్టాండ్లు రద్దీగా ఉంటాయి. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా <<17770319>>ఆర్టీసీ <<>>ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఒకే చోట 50 మంది విద్యార్థులు ఉంటే ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో మేనేజర్లను సెల్ నంబర్లలో సంప్రదిస్తే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు.
నంబర్లు ఇవే
ADB, UTNR-99592 26002
NRML- 99592 26003
MNCL- 99592 26004
భైంసా- 99592 26005
ASF- 9592 26006
SHARE IT
News September 20, 2025
పొద్దుటూరులో వడ్డీ వ్యాపారి కిడ్నాప్

పొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాల రెడ్డి కిడ్నాప్ అయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం సమీపంలో వేణుగోపాల్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అరుణ్ రెడ్డి కేసు నమోదు చేశామన్నారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News September 20, 2025
విజయవాడలో కొత్త రూపంలో డ్రగ్స్

విజయవాడలో కొత్తరకం డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మెడికల్ షాపులో టాబ్లెట్స్‌లా గంజాయి టాబ్లెట్ల ఫోటోలు బయటకు రావడం హల్చల్‌గా మారింది. నగరంలో మూడు, నాలుగు బస్తాలకు పైగా ఇలాంటి డ్రగ్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది. మాచవరం పరిధిలో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం. దసరా ఉత్సవాలపై పోలీసుల దృష్టి ఉండడంతో డ్రగ్స్ సప్లై చేసే ముఠా సభ్యులు చెలరేగిపోతున్నారు.