News March 21, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..

కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం.. గజ్వేల్ మండలం దిలాల్పూర్‌కు చెందిన క్యాసారం బాబు సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్యలో స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News March 21, 2025
చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.
News March 21, 2025
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి: గద్వాల కలెక్టర్

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 20న జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులు ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సంతోష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియామకం పొందిన అభ్యర్థులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.
News March 21, 2025
వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో గద్వాల ఇన్‌స్టా రీల్

ఏపీ అమెరికా అసోసియేషన్ AAA బృందం నిర్వహించిన వరల్డ్ వైడ్ రీల్ కాంటెస్ట్ గద్వాల్ నుంచి పంపిన రీల్‌ను నిర్వాహకులు సెలెక్ట్ చేశారు. ఈ రీల్ కాంటెస్ట్‌లో ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, కవులు, స్వాతంత్ర్య సమరయోధులు, గాయకులు గురించి 1.30 నిమిషంలో రెడీ చేసి కాంటెస్ట్‌కి పంపారు. గద్వాలియన్స్ ఇన్ స్టా పేజీ నుంచి పంపిన రీల్ <