News November 10, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ANM దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన<<18244517>> రోడ్డు ప్రమాదం<<>>లో ఏఎన్ఎం దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మం. గంగాపురం వాసి ఎర్రోళ్ల నర్సయ్య.. భార్య సునీత(30), కుమార్తె కీర్తనతో కలిసి బైక్‌పై చేర్యాల నుంచి వస్తున్నారు. లేనిన్‌నగర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సునీత స్పాట్‌లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి బిడ్డను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సునీత శనిగరం PHCలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది.
Similar News
News November 10, 2025
APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/
News November 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.


