News January 29, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News February 19, 2026
టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు: BR నాయుడు

AP: కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన YCP హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని స్పష్టం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స విషయాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేవదేవుని సొమ్ముని నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకు వాడే అంశంలో రాజీపడేది లేదని ట్వీట్ చేశారు.
News February 19, 2026
చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
News February 19, 2026
ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గురువారం శాసనసభలో మాట్లాడారు. సైబర్ వర్టికల్ వింగ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.2కోట్లతో అధునాతనమైన సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సమకూరుస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.


