News February 22, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన వుడెం మల్లారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పై సిద్దిపేట నుంచి మర్పడ్గకు వస్తుండగా పొన్నాల ఆయిల్ మిల్ దాటాక మూల మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 22, 2025
సంగారెడ్డి: ఈనెల 24న పదో తరగతి పరీక్షలపై శిక్షణ

మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎంఈవోలకు, రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంటెంట్, డిపార్ట్మెంట్లకు ఈనెల 24న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొంటారని చెప్పారు.
News February 22, 2025
మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.
News February 22, 2025
కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్ (2/2)

✓ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఏం తెచ్చడో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✓ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✓ చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
✓ ఇల్లందకుంట: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు
✓ చిగురుమామిడి: యూరియాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: మండలం వ్యవసాయ అధికారి రాజుల నాయకుడు
✓ మొలంగూర్ లో క్షయ వ్యాధి నివారణ మొబైల్ క్యాంప్