News January 31, 2025

సిద్దిపేట: రోడ్డు భద్రత అందరి బాధ్యత: శంకర్ నారాయణ

image

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట రవాణాశాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఎక్కువ శాతంలో అరికట్టవచ్చని వివరించారు. ఇందులో ఆధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 10, 2025

గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి పాత్ర కీలకం

image

సింహాచలం గిరి ప్రదక్షిణ విజయవంతంలో ప్రధానంగా 3 వర్గాల పాత్ర అత్యంత కీలకం. స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులిది ప్రధాన భూమిక. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు తాగునీరు, ఇతర ఆహార పదార్థాలు అందజేయడంలో స్వచ్ఛంద సంస్థలు, భక్తులు రోడ్డుపై వేసే చెత్త తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విశేష కృషి చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి కృషి ప్రశంసనీయం.

News July 10, 2025

జగిత్యాల: అడ్రస్ మారినా అప్‌డేట్ చేయని అధికారులు

image

జగిత్యాల ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దాదాపుగా రెండేళ్ల క్రితమే జగిత్యాల జిల్లా ఆర్టీఏ కార్యాలయం తాటిపల్లి గ్రామానికి తరలించగా, ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకుంటున్న వారికి డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ ధరూర్ క్యాంపు అని చూపించడంతో అవాక్కవుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం, డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ మారినా వెబ్‌సైట్‌లో ఇంకా అడ్రస్ అప్‌డేట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News July 10, 2025

జగిత్యాల: సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణమూర్తి

image

జగిత్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎం.జి.కృష్ణమూర్తి గురువారం బాధ్యతలను స్వీకరించారు. కొన్ని రోజులుగా ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ సుమన్‌రావు వ్యవహరించారు. గాంధీ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కృష్ణమూర్తిని జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.