News June 26, 2024

సిద్దిపేట: లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసి అమ్మాయి సూసైడ్

image

ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. ములుగు మండలం కొక్కొండకు చెందిన మహేశ్వరి(22) నూజివీడు కంపెనీలో పనిచేస్తూ విజయ్‌ను లవ్ చేసింది. సోమవారం రాత్రి మహేశ్వరి అక్కతో విజయ్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఆమెకు పంపాడు. దీంతో తమ ప్రేమ వ్యవహారం పేరెంట్స్‌కు తెలిసిందని మనస్తాపంతో యువతి ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Similar News

News June 29, 2024

చేగుంట: ప్రమాదంలో 250 మేకలు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో 44వ జాతీయ రహదారి బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 250 మేకలు మృతి చెందాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందగా.. లారీలో ఉన్న 460 మేకల్లో సుమారు 250 మేకలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మేకల మండికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

News June 29, 2024

సంగారెడ్డి: నేడు తార డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

image

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT

News June 29, 2024

SRD: ప్రభుత్వ పాఠశాలల ఆడిట్ షెడ్యూల్ విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.