News March 18, 2025
సిద్దిపేట: లిఫ్ట్ గుంతలో కుళ్లిన శవం లభ్యం

ములుగు మండలం లక్ష్మక్కపల్లి శివారులో ఓ కంపెనీ నిర్మాణ లిఫ్టు గుంతలో కూలిన శవం లభించినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ములుగు మండలం తానేదార్ పల్లికి చెందిన జామకాయల నర్సింలు (42) ఇంటి నుంచి వెళ్లి రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం కుళ్లిన స్థితిలో నర్సింలు శ్యామ్ లభించినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 18, 2025
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
News March 18, 2025
VKB: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, సదానందరెడ్డి, రమేశ్, కేపీ రాజు, వడ్ల నందు, రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డారు. కాగా అధ్యక్ష పదవి రాజశేఖర్ రెడ్డికి వరించింది. తన నియామకానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News March 18, 2025
సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. 100M పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. మడకశిర ఎమ్మెల్యే రాజు క్రికెట్ ఆడనున్నారు.