News October 9, 2025
సిద్దిపేట: లైసెన్సుడ్ తుపాకులు అప్పగించాలి: సీపీ

ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల(స్థానిక సంస్థల ఎలక్షన్స్) కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 11 లోపు డిపాజిట్ చేయాలని, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొని వెళ్లవచ్చని తెలిపారు.
Similar News
News October 9, 2025
ఏసీబీకి చిక్కిన చిట్యాల ఎమ్మార్వో

చిట్యాల తహశీల్దార్ కృష్ణ ఏసీబీకి చిక్కారు. భూమికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అధికారులు ఆయన నివాసంలో ఆస్తుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News October 9, 2025
అనకాపల్లి: ‘తగ్గిన వైద్య పరికరాలు మందుల ధరలు’

జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైద్య పరికరాలు, మందుల ధరలు తగ్గినట్లు DMHO డాక్టర్ హైమావతి తెలిపారు. గురువారం అనకాపల్లి DMHO కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ తగ్గడంతో వైద్య ఖర్చుల్లో ప్రజలకు ఆదా అతుందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
News October 9, 2025
‘మేము రాము భర్కత్‌పురా PF ఆఫీస్‌కు’

భర్కత్‌పురా PF ఆఫీస్‌లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్‌పుర PF ఆఫీస్‌కు అంటున్నారు. స్లిప్‌లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.