News November 28, 2025
సిద్దిపేట: లైసెన్స్ గన్స్‌ను PSలో ఇవ్వాలి: సీపీ

స్థానిక సంస్థల సాధారణ (గ్రామపంచాయతీ )ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో 29లోపు డిపాజిట్ చేయాలని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొవచ్చని సూచించారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
News December 1, 2025
నల్గొండ: పార్లమెంటులో సమస్యలపై గళమెత్తాలి..!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే సమావేశాల్లో నియోజకవర్గాలలోని సమస్యలపై ఎంపీలు మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
HYD: ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం