News October 7, 2025
సిద్దిపేట: వాల్మీకి జయంతి వేడుకల్లో కలెక్టర్

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ రోజును జాతి గుర్తుంచుకోవాలని, ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
మహర్షి వాల్మీకి ఆదర్శంతో జిల్లాను అభివృద్ధి చేయాలి

వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని జిల్లా అధికారులు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. యుక్త వయసులో మహర్షి దోపిడీ చేస్తూ దొంగగా జీవించేవారని తన తప్పు తెలుసుకుని మారడంతో వాల్మీకి మహర్షిగా నిలిచాడన్నారు. అధికారులు పాల్గొన్నారు.
News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.
News October 7, 2025
MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.