News March 4, 2025
సిద్దిపేట వాసికి జాతీయ స్థాయి ఉగాది విశ్వశాంతి పురస్కారం

చిందు యక్షగాన కళా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి మందపల్లి గ్రామానికి చెందిన పిల్లీట్ల కిష్టయ్యకి జాతీయ స్థాయి ఉగాది విశ్వశాంతి పురస్కారం అవార్డు వరించింది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పిల్లీట్ల కిష్టయ్య ఆదివారం హైద్రాబాద్ రవీంద్ర భారతిలో అరణ్య సకల కళా వేదికపై జాతీయ స్థాయి ఉగాది పురస్కారం దూడపాక శ్రీధర్ చేతుల మీదుగా సోమవారం అందుకున్నారు.
Similar News
News March 4, 2025
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయం నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికిచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ‘అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని తెలిపింది.
News March 4, 2025
కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం ఓ వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు SI విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంను మద్యం మత్తులో ఉన్న దినేశ్ ఆసుపత్రి అడ్రస్ అడిగాడు. ఆయన చెప్పకపోవడంతో దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో ఆయన గొంతుపై దాడి చేశాడు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 4, 2025
భర్త ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన పరసా రాధిక తన భర్త ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. పెళ్లై 10 సంవత్సరాలైందని, భర్త ధర్మరాజు తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే ఉద్యోగం సాధించగలిగానని రాధిక తెలిపారు. భర్త గంధం ధర్మరాజు బీటెక్ చదివి సొంత ఊర్లోనే వ్యవసాయం, తేనెటీగల పరిశ్రమ నడుపుతున్నారు. రాధిక దంపతుల కుమారుడు నోయల్ మూడవ తరగతి చదువుతున్నాడు.