News April 6, 2024

సిద్దిపేట: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ పదవ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఇ.శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు కొండపాక ఎంఈవో పేర్కొన్నారు.

Similar News

News February 14, 2026

మెదక్: వరుసగా 3వ సారి విజయం

image

మెదక్ పట్టణం 14వ వార్డులో కౌన్సిలర్‌గా దొంతి లక్ష్మి మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున, 2020లో స్వతంత్ర అభ్యర్థిగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత 15 సంవత్సరాలుగా తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తున్న 14వ వార్డు ప్రజలకు దొంతి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు.

News February 14, 2026

మెదక్: కౌన్సిలర్లుగా వదిన మరదలు

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 3వ వార్డు నుంచి కొటాల లలిత విశ్వం, 4వ వార్డు నుంచి ధరిమిశెట్టి స్వరూప బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్లుగా గెలుపొందారు. స్వయానా వదిన, మరదలైన వీరిద్దరూ విజయం సాధించడంతో అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News February 13, 2026

మెదక్ జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్‌తో కలిసి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.