News October 15, 2025

సిద్దిపేట: ‘విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు’

image

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. నంగునూరు మం. బద్దిపడగ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించకపోవడం, పాఠాశాల పరిశుభ్రంగా లేకపోవడంతో హెచ్‌ఎంను సప్పెండ్ చేశారు. సిద్దిపేట(R) మం. తోర్నాల ZPHSలో కామన్ డైట్ మెనూలో భాగంగా మిక్స్‌డ్ వెజిటేబుల్ కూర, సాంబారు కాకుండా ఆలుటమాట కూర, పచ్చిపలుసు మాత్రమే పెట్టడంపై HM, సిబ్బందిపై చర్యలు ఆదేశించారు.

Similar News

News October 15, 2025

₹13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

image

AP: PM మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ₹13వేల కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని CM CBN తెలిపారు. ‘గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులొస్తున్నాయి. కూటమితో APని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుదాం. PM సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.

News October 15, 2025

HYD: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపిక

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రధానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేసామన్నారు.

News October 15, 2025

HYD: ఎన్నికల వేళ.. జ్యోతిషులు ఫుల్ బిబీ

image

ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇంకా నామినేషన్ వేయకముందే వారిలో ఒకరకమైన ఆందోళన.. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు ఏ రోజు మంచిదో చూసుకొని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే సిటీలో పంచాంగ కర్తలు, జ్యోతిషులు బిబీ.. బిజీగా మారారు. పేరు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ప్రకారం జాతకం చూస్తూ ఎప్పుడు నామినేషన్ వేయాలో, ఏమేం పూజలు చేయాలో చెబుతున్నారు.