News February 11, 2025

సిద్దిపేట: వేర్వేరుగా ముగ్గురు ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కోహెడలో జీవితంపై విరక్తితో తిరుపతి రెడ్డి(50) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. హుస్నాబాద్‌లో కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని రాజు(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గజ్వేల్ మండల పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో రవీందర్(35) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Similar News

News February 11, 2025

ఊట్కూర్: అదుపుతప్పిన స్కూటీ.. ఇద్దరికీ గాయాలు

image

ఊట్కూరు మండల పరిధిలోని కొల్లూరు గేట్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కిందపడి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్‌కు చెందిన గొల్ల కిష్టు తన స్కూటీపై మరో వ్యక్తితో కలిసి మక్తల్ వైపు వెళుతుండగా కొల్లూరు గేట్ సమీపంలో అతని స్కూటీ అదుపుతప్పి కింద పడింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

News February 11, 2025

బాపట్ల: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

బాపట్ల జిల్లాలోని రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. లాడ్జి నిర్వాహకులు అతిథుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని, వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 11, 2025

భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

image

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.

error: Content is protected !!