News March 1, 2025
సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.
Similar News
News February 28, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారా?

US, Israel దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీనిని ఇరాన్ వర్గాలు ఖండించాయి. తనకు తెలిసినంత వరకు ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ తెలిపారు. కాగా ఖమేనీ పరిస్థితిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు Israel దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నాసీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.
News February 28, 2026
ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 28, 2026
NZB: ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలి

GGHలో కొనసాగుతున్న ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన మాతాశిశు ఆరోగ్య కేంద్రం (MCH), క్రిటికల్ కేర్ యూనిట్‌లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. సుదీర్ఘ కాలం నుంచి పలు పనులు పెండింగ్‌లోనే ఉండడం గమనించిన సుదర్శన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


