News February 7, 2025

సిద్దిపేట: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: DMHO

image

ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట డీఏంహెచ్‌ఓ పాల్వన్ కుమార్ సూచించారు. గురువారం జిల్లాలోని జగదేవ్ పూర్, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న పరీక్ష నమూనాలను పరిశీలించారు.

Similar News

News March 1, 2026

ఈ రంగు కార్లలో మరింత వేడి!

image

వేసవిలో కారు రంగు ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తెలుపు వంటి లేత రంగులు సూర్యరశ్మిని పరావర్తనం చేయడంతో క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. కానీ నలుపు వంటి ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ముదురు రంగు కార్లలో AC కూలింగ్ ఆలస్యమవ్వడమే కాకుండా కంప్రెషర్‌పై భారం పడి మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

News March 1, 2026

నారాయణపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

image

జిల్లాలో ఇవాళ్టి నుంచి ఈనెల 31వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక, విద్యార్థి, రైతు సంఘాల నేతలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 1, 2026

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 100 పోస్టులు

image

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(<>AFMS<<>>) 100 మెడికల్ ఆఫీసర్ పోస్టులను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది. MBBS, నీట్ పీజీ ఎగ్జామినేషన్ అర్హత సాధించినవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. మార్చి 17న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.join.afms.gov.in