News March 1, 2026
సిద్దిపేట: సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

గోవాలో జరిగిన 22వ దక్షిణ భారత జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది. తెలంగాణ పురుషుల జట్టు తృతీయ స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ తెలిపారు. సిద్దిపేటకు చెందిన పూజ(ఉత్తమ ఫీచర్), ప్రియాంక(ఉత్తమ క్రీడాకారిణి) అవార్డులు అందుకున్నారు. క్రీడాకారుల ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News March 2, 2026
మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
News March 2, 2026
కృష్ణా: గణితం పరీక్షకు 255 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం గణితం పరీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 15,100 మంది విద్యార్థులకు గాను 14,845 మంది హాజరయ్యారని, 255 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సరళాదేవి తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: హోలీ.. మోదుగ పూలకుందో ప్రత్యేకత

హోలీ పండుగ రోజు మోదుగ పూలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని గిరిజనుల చెబుతారు. వీటిని రసాయన రహిత, సహజ సిద్ధమైన రంగుల తయారీలో వాడుతారు. ముఖ్యంగా గిరిజనులు హోలీ పండుగకు ముందురోజు మోదుగ పూలను సేకరించి ఎండబెట్టి పొడి చేస్తారు. లేదా నేరుగా నీటిలో మరిగించి ఆ నీటీని హోలీ రంగుగా వాడుతారు. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఆదీవాసులు మోదుగ పూలతోనే సంప్రదాయ హోలీని జరుపుకుంటున్నారు.


