News April 17, 2024
సిద్దిపేట: సివిల్స్ ర్యాంకర్ అఖిల్ నేఫథ్యం ఇదే..
వ్యవసాయ కుటుంబం నుంచి IASగా నిలిచి తల్లిదండ్రుల కష్టాన్ని సగర్వంగా నిలిచేలా చేశాడు. వైఫల్యాలు వెక్కిరించినా ఐదో ప్రయత్నంలో IAS సాధించాడు కొండపాకకు చెందిన అఖిల్. తండ్రి నరేష్ వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు అఖిల్‌ను ఉన్నత చదువులు చదివించాడు. 2018లో ఇంజనీరింగ్ అయిపోగానే ఇంటి నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ అయి 2019,20, 22లో నిరాశ ఎదురైనా 2021లో IPS సాధించాడు. 2023లో IAS సాధించి లక్ష్యాన్ని ముద్దాడాడు.
Similar News
News November 26, 2024
గజ్వేల్: ఆవాలతో అంబేద్కర్ చిత్రం అదుర్స్
రాజ్యాంగం అమోదించి 75సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రాన్ని గజ్వేల్ కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవ రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవాలతో చిత్రించి అంబేద్కర్‌పై ఉన్న గౌరవాన్ని చాటాడు. రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని ఆవాలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
News November 25, 2024
దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి
కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.