News October 6, 2025

సిద్దిపేట: సీపీ అనురాధకు ఘనంగా వీడ్కోలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ బి.అనురాధ ఇటీవల LB నగర్ DCPగా బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా బదిలీపై వెళ్తున్న అనురాధను ఈరోజు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. గౌరవ వందనం చేసి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

Similar News

News October 6, 2025

అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల వినతి పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News October 6, 2025

స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించ గల సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, ఎంపీడీవోలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై అంశాల వారిగా అర్జీలపై మండలాలు వారిగా విశ్లేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. నేటి పీజీఆర్ఎస్‌లో 149 అర్జీలు స్వీకరించారు.

News October 6, 2025

ఆకాశం నుంచి బంగారు వర్షం.. ఎప్పుడంటే?

image

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1944, ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డాక్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బ్రిటన్ నౌక ‘ఫోర్ట్ స్టికిన్’ తునాతునకలైంది. దీంతో అందులోని 3,50,000 కిలోల బంగారు బిస్కెట్లు గాల్లోకి ఎగిరి వర్షంలా కురిశాయి. వందల మీటర్ల దూరంలో ఇవి ఎగిసిపడటంతో ప్రజలు వీటికోసం పరుగులు తీశారు. అయితే ఓడలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలుండటంతో భారీ విస్పోటనం జరిగి 800 మందికి పైగా చనిపోయారు.