News December 27, 2024
సిద్దిపేట: స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్: మంత్రి పొన్నం

స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.
Similar News
News April 25, 2025
మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.
News April 25, 2025
నర్సాపూర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News April 25, 2025
మెదక్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన యువతి

సైబర్ మోసగాళ్ల వలలో పడి యువతి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రూ.1000 చెల్లిస్తే రూ.600 కమిషన్ వస్తుందని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా రూ.1.28 లక్షలు చెల్లించిన యువతి తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.