News February 10, 2025
సిద్దిపేట: హత్య చేసిన కేసులో నిందితుల అరెస్ట్

ఈ నెల 6న జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ జి. మధు తెలిపారు. అబ్బు లింగం, అబ్బు యాదవ్వ, అబ్బు కృష్ణమూర్తి, పిండి ఎల్లం, పిండి కవితలు ఈ నెల 7న సేలంపు గ్రామ శివారులో ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యను భూతగాదాల విషయంలో సొంత అక్క హత్య చేసినట్లు గుర్తించి, ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Similar News
News November 11, 2025
తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.
News November 11, 2025
MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 11, 2025
‘తుఫాను బాధితులకు తక్షణమే పరిహారం అందించాలి’

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలు, రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. తుఫాను వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారికి మేలు చేయాలని కోరారు.


