News September 21, 2025
సిద్దిపేట: ‘హెచ్-1 బీ వీసా ఫీజుల పెంపుపై స్పందించాలి’

హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, అలాగే ఇటీవలి కార్మిక-ఆధారిత రంగాల్లో 25% సుంకం పెంపు, కేంద్ర ప్రభుత్వానికి జరిగిన దౌత్య పరాజయాన్ని ప్రతిబింబిస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు, అక్కడే పనిచేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు అమెరికా ప్రభుత్వంతో ప్రారంభించాలని ఎక్స్ వేదికగా హరీశ్ రావు కోరారు.
Similar News
News September 21, 2025
జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
News September 21, 2025
ములుగు: సంప్రదాయ దుస్తులు.. గౌరమ్మ పోలికలు!

ములుగు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు బొడ్రాయి, ఆలయాల వద్ద ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేస్తున్నారు. చిన్నారులను అందంగా అలంకరించిన తల్లిదండ్రులు ‘గౌరమ్మ పోలిక’ అంటూ సంబరపడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూల బతుకమ్మలతో పాటు పట్టు చీరలు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
News September 21, 2025
మెదక్: ‘అమెండ్‌మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలి’

ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు PRTU TS విజ్ఞప్తి చేసినట్లు అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, సర్వీస్ రూల్స్ అమలుపరిచేలా తగిన సహకారం అందించాలన్నారు.