News March 13, 2025
సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.
Similar News
News September 15, 2025
సిరిసిల్ల: ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సోమవారం వినతిపత్రం అందించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణలోనే పెద్ద పండుగలు అయిన బతుకమ్మ, దసరా వస్తున్నందున కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. పండుగ రోజు డబ్బులు లేక వాళ్ళు ఇబ్బందులు పడతారన్నారు.
News September 15, 2025
PGRS ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత: ఎస్పీ కృష్ణరావు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి 127 ఫిర్యాదులను స్వీకరించారు. ఆస్తి, ఆర్థిక, కుటుంబ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News September 15, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 185 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలేక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి మొత్తం 185 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 61, డీఆర్డీఏకు 44, హౌసింగ్‌కు 25, ఉపాధి కల్పన కార్యాలయం, ఎన్డీసీలకు 8 చొప్పున, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 6 చొప్పున దరఖాస్తులు అందాయి.