News September 9, 2025
సిద్దిపేట: 1st వందల్లో ఇచ్చి లక్షల్లో లాగేస్తారు: సీపీ

పార్ట్ టైం జాబ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని CP అనురాధ పేర్కొన్నారు. ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించవచ్చని వచ్చే కాల్స్‌ను నమ్మొద్దన్నారు. మొదట్లో వందల్లో ఇచ్చి ఆపై లక్షల్లో లాగేస్తారని, ఆన్లైన్ టాస్క్‌ల పేరిట ముంచేస్తారని ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ను నమ్మొద్దని సూచించారు. అప్రమత్తతే మిమ్మల్ని రక్షిస్తుందని, ఎవరికి రిఫర్ చేయొద్దని సీపీ సూచించారు.
Similar News
News September 9, 2025
ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే టీడీపీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులున్నారు.
News September 9, 2025
నార్సింగిలో ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహరీక రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి రూ.10 లక్ష డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ రూ.4 లక్షలు తీసుకుంటుండగా మనిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 9, 2025
నార్సింగిలో ఏసీబీకి పట్టుబడ్డ అధికారిణి

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహరీక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి రూ.10 లక్ష డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ రూ. 4 లక్షలు తీసుకుంటుండగా మనిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.