News September 20, 2025

సిద్దిపేట: 21న చింతమడకకు కవిత రాక

image

మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వస్తున్నారని జాగృతి ప్రతినిధులు తెలిపారు. కాగా ఇటీవల పలువురు గ్రామస్థులు కవితని కలిసి గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలు రావాలని కోరారు. స్పందించిన కవిత ఉత్సవాలకు హాజరవుతారని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వస్తున్నారని తెలిపారు.

Similar News

News September 20, 2025

మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మాచర్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 10:45కి యాదవ్ బజార్‌లో జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో మాట్లాడతారు. 3:35 గంటలకు ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్తారు.

News September 20, 2025

రూ.35వేల కోట్లంటూ హరీశ్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్

image

TG: తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి <<17757923>>రూ.35వేల కోట్లు<<>> అంటూ హరీశ్ రావు చేసిన ప్రకటన అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్లొస్తాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, అయితే ప్రభుత్వం అంచనాలు రూపొందించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు.

News September 20, 2025

నాయుడుపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాయుడుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్లిపేడు పంచాయతీకి చెందిన శివయ్య(34) ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాములో పనిచేస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.