News November 23, 2025

సిద్దిపేట: 25న వాడిన సామాగ్రి వేలంపాట

image

వాడిన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, టెంట్లు ఇతర సామాగ్రికి 25న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పెద్ద కోడూరు శివారు)లో వేలంపాట వేస్తున్నట్టు సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు వేలంపాట ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు 87126 67416, 87126 67422 సంప్రదించాలన్నారు.

Similar News

News November 23, 2025

KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

image

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

image

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.

News November 23, 2025

మధ్యవర్తిత్వం వేగవంతమైన న్యాయానికి కీలకం: జస్టిస్‌ లక్ష్మణ్‌

image

కేసుల భారాన్ని తగ్గించి, వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో న్యాయవాదుల శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు బయటే తక్కువ ఖర్చుతో, సంబంధాలు కాపాడుతూ పరిష్కారం పొందవచ్చని సూచించారు. న్యాయవాదులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.