News February 25, 2026
సిద్దిపేట: 4వ అంతస్తు నుంచి పడి మృతి

సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుంచి జారిపడి బశెట్టి రాజు (41) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోవా కట్టెలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. మృతుడు సిద్దిపేట వాసిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శశాంక్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 26, 2026
బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.
News February 26, 2026
HYD: రేపు మెగా జాబ్ మేళా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4 జాబ్స్ సాకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. 27 FEB 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, దివ్యాంగ ధ్రువీకరణపత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.
News February 26, 2026
ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు: ఆర్ఎం

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు.


