News December 29, 2025
సిద్దిపేట: 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సమాయత్తం

సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల వివరాలు.. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా జనాభా 16,544 మంది కాగా ఎస్టీలు 93, ఎస్సీలు 3,453 మంది ఉన్నారు. దుబ్బాకలో 20 వార్డులు ఉండగా జనాభా 27,496 మంది కాగా ఎస్టీలు 238, ఎస్సీలు 4,478 మంది, గజ్వేల్‌లో 20 వార్డులు ఉండగా జనాభా 37,881 మంది కాగా ఎస్టీలు 649, ఎస్సీలు 3,460, హుస్నాబాద్‌లో 20వార్డులు ఉండగా జనాభా 22,082మంది కాగా ఎస్టీలు 769, ఎస్సీలు 4,322 మంది.
Similar News
News December 30, 2025
థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.
News December 30, 2025
451 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in.
News December 30, 2025
REWIND 2025: కృష్ణా జిల్లా ఖ్యాతిని చాటిన ప్రతిభా విజయాలు

* కృష్ణాజిల్లా పరిషత్‌కు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అవార్డు
* ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన పాలడుగు శివకి గద్దర్ అవార్డు
* USA 2025 కిరీటం దగ్గించుకున్న గుడివాడ వాసి మౌనిక అట్లూరి
* కూచిపూడిలో జరిగిన యోగాకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
* ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యాపకులకు జాతీయస్థాయి అవార్డులు


