News October 9, 2025
సిద్దిపేట: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు: మంత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరుపున మా వాదనలు బలంగా వినిపించామన్నారు. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామని, సభలో మాట్లాడినప్పుడు అన్ని పార్టీల వారు స్పష్టంగా మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
Similar News
News October 9, 2025
నేడే అట్ల తద్ది.. ఏం చేయాలంటే?

ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొనే అట్ల తద్దికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గౌరీదేవిని పూజించే వ్రతం. మాంగల్య సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులను కోరి నేడు గౌరీదేవిని పూజిస్తారు. చంద్రోదయ వేళలో ఉమాదేవి వ్రతం నిర్వహిస్తారు. దీనివల్ల ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన శివపార్వతుల అనుగ్రహం, గౌరీ దేవి కరుణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తప్పక ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు.
News October 9, 2025
అట్ల తద్ది: గౌరీదేవి పూజా విధానం

అట్ల తద్ది రోజున గౌరీదేవికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా.. పీఠంపై బియ్యం పోయాలి. దానిపై తమలపాకులు ఉంచి, పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలు, గంధం ఉపయోగించి, అమ్మవారికి అర్చన చేయాలి. అట్లు, ఇతర నైవేద్యాలను సమర్పించాలి. ముగ్గురు/ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇచ్చి, ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే.. గౌరీదేవి అనుగ్రహంతో స్త్రీలకు సర్వసుఖాలు కలుగుతాయని ప్రతీతి.
News October 9, 2025
వరంగల్: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..!

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వని నేపథ్యంలో ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాలకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. 11న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 23న పోలింగ్ జరగనుంది.