News April 1, 2025
సిద్దిపేట: 48 మంది ఈవ్‌టీజర్లపై కేసులు

48 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గుర్తించిన 36 హాట్ స్పాట్స్ వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 48 మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. మహిళలు మౌనం వీడి వేధింపులపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News April 3, 2025
కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
News April 3, 2025
బెల్లంపల్లి: ‘SC, ST కేసుల్లో జాప్యం చేయకూడదు’

కరీంనగర్ జిల్లాలో SC, STకమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా SC, ST రివ్యూ మీటింగ్‌లో సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. SC, STకేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా రిజిస్టర్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో SC, STలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. SC, ST హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
News April 3, 2025
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.