News September 11, 2025
సిద్దిపేట: ALERT.. మూడు రోజులు భారీ వర్షాలు: సీపీ

మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.
Similar News
News September 11, 2025
జగిత్యాల: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి చెందిన బురం దేవదాస్(50) ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన 2 నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. తన పిల్లలకు వివాహం చేయలేనని మనస్తాపం చెంది, భార్యతో గొడవపడి ఎలుకల మందు తాగి చనిపోయాడని చెప్పారు. అతడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News September 11, 2025
SRPT: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ గురువారం తెలిపారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశమన్నారు.
News September 11, 2025
కరీంనగర్: ‘దీపావళి టపాసుల విక్రయదారులు దరఖాస్తు చేసుకోవాలి’

దీపావళి పండుగకు తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు సెప్టెంబర్ 24వ తేదీలోగా సీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని KNR పోలీస్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. నియమ నిబంధనలు, రక్షణ చర్యలు చేపట్టిన వారికే అనుమతులు వస్తాయన్నారు. దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్ కార్డు, పదో తరగతి మెమో, రూ.600 చలానాను జత చేస్తూ, ఐదు సెట్స్‌ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.