News January 1, 2026

సిద్దిపేట: GREAT.. నలుగురికి పునర్జన్మనిచ్చారు

image

సిద్దిపేట జిల్లా చేర్యాల PSలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేందర్‌ ఇటీవల విధులకు వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఈ క్రమంలో నరేందర్‌ భౌతికంగా లేకపోయినా, మరొకరి రూపంలో జీవించాలనే ఆకాంక్షతో కుటుంబీకులు అవయవదానానికి ముందుకొచ్చారు. ‘జీవన్ దాన్’ సంస్థ ద్వారా గుండె, కాలేయం, కిడ్నీలు సేకరించి నలుగురికి పునర్జన్మనిచ్చారు.

Similar News

News January 1, 2026

NEW YEAR: హ్యాంగోవర్ తగ్గాలంటే..

image

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి <<18724599>>సమస్యలు<<>> ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అల్లం టీ వికారాన్ని, అరటిపండు నీరసాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకుని కాసేపు నిద్రపోతే హ్యాంగోవర్ తగ్గుతుంది. share it

News January 1, 2026

మహిళల సొమ్ము దారిమళ్లిస్తే జైలుకే: కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు బుధవారం తెలిపారు. నిధులు దారిమళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు.

News January 1, 2026

బత్తాయి జ్యూస్‌ లాభాలు తెలుసా?

image

నిత్యం మార్కెట్లో దొరికే బత్తాయి (మోసంబి) జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. డిటాక్సిఫికేషన్ ద్వారా శరీరం శుభ్రపడుతుంది. కళ్లకు, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తూ వృద్ధాప్య ఛాయ‌లు తగ్గించడంలో సహాయపడుతుంది.