News April 13, 2026
సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్‌లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
Similar News
News April 14, 2026
16 నుండి మండలస్థాయి సదస్సులు : ADB కలెక్టర్

జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్నగూగుల్ మీట్ లో దిశానిర్దేశం చేశారు. సదస్సుల నిర్వహణలో భాగంగా పోషణ్ మాస్ స్టాల్స్‌తో పాటు గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్మానం చేసిన గ్రామాలకు గుర్తింపునివ్వాలన్నారు.
News April 14, 2026
HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

HYDలో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు <<8712661212>>8712661212<<>> నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
News April 14, 2026
HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

హైదరాబాద్ లో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు 87126 61212 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.


