News January 23, 2025
సిద్దిపేట: WOW.. రెండు కళ్లు సరిపోవట్లే !

పచ్చని పొలాలు, పల్లెటూరి అందాలు సాధారణంగా ఎవరినైనా కట్టిపడేస్తాయి. అయితే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లిలో ఓ దృశ్యం మాత్రం అంతకుమించి ఉంది. వరి నాటు కూలీలు తమ పనిలో నిమగ్నవగా సమీపంలో ఓ రైలు వెళుతున్న సీనరీ చూపరులను కట్టిపడేస్తుంది. వారి ఛాయ నారు మడిలో పడుతుండగా ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లు ఆ ఫోటో ఉంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Similar News
News September 19, 2025
ప్రతిభ చూపితే చాలు ఏటా రూ.12వేలు!

ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థుల నుంచి NMMS పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా ₹12వేల సాయం లభిస్తుంది. దరఖాస్తులు ఈనెల 30లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. రీజనింగ్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో 3 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది అనంతపురం జిల్లాలో 4,200 మంది దరఖాస్తు చేయగా 210 మంది అర్హత సాధించారు.
News September 19, 2025
SRD: బంధువులను పరామర్శించేందుకు వెళ్తూ..

సంగారెడ్డిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ చనిపోయింది. సదాశివపేటకు చెందిన విజయలక్ష్మి(60), కూతురు- అల్లుడు అరుణ, ప్రతాప్‌తో కలిసి HYDలో బంధువులను పరామర్శించేందుకు బైక్‌పై వెళ్తున్నారు. పోతిరెడ్డిపల్లి సిగ్నల్ వద్ద బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో విజయలక్ష్మి స్పాట్‌లోనే చనిపోగా, గాయపడ్డ అరుణ, ప్రతాప్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.