News August 14, 2025

సినిమాకి వెళ్తానన్న భర్త.. గొడవపడి ఉరేసుకున్న భార్య

image

రుద్రవరం మం. చందలూరులో ప్రసన్న (28) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. భర్త ఆంజనేయులు సినిమాకి వెళ్తాననడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసన్న క్షణికావేశంలో ఉరేసుకుంది. గమనించిన భర్త ఆమెను కిందకు దించేలోపే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలన్న తెలిపారు.

Similar News

News August 14, 2025

సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి

image

రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల నేపథ్యంలో సైకాలజిస్టులకు కౌన్సిలర్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జనగామ జిల్లా నాయకులు కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల మురళి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సైకాలజిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ అవసరమని పేర్కొన్నారు.

News August 14, 2025

GWL: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

image

గద్వాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి హాజరై ఉదయం 9:30 గంటలకు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.

News August 14, 2025

ఏలూరు: విద్యుత్ దీపాలతో కలెక్టరేట్

image

ఏలూరు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్‌ను త్రివర్ణ రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.