News November 30, 2025

సినిమా అప్డేట్స్

image

❀ బాలకృష్ణ ‘అఖండ-2’ మూవీ టికెట్‌ను రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేసిన జర్మనీలోని అభిమాని రాజశేఖర్.. చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చినట్లు వెల్లడించిన మూవీ యూనిట్
❀ జనవరి నెలాఖరు నాటికి రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా తెరకెక్కుతోన్న ‘పెద్ది’ షూటింగ్ పూర్తి. డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో షూటింగ్: సినీ వర్గాలు
❀ హీరోయిన్ రాశీఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Similar News

News March 26, 2026

సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

image

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>

News March 26, 2026

ఏదో ఒకటి తేల్చుకోండి.. లేకపోతే: ట్రంప్

image

తమతో డీల్‌ కోసం ఇరాన్ అడుక్కుంటోందని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం మరోలా చెబుతోందన్నారు. ఏదో ఒక విషయం ఆ దేశం త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడబోమని తేల్చి చెప్పారు. కాగా 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ఇటీవల ఆయన ప్రకటించగా, తమకు అగ్రరాజ్యం భయపడిందని ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే.

News March 26, 2026

మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

image

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <>బుక్<<>> చేసుకోవచ్చు. రూ.850 నుంచి రూ.23,000వరకు టికెట్ ధరలున్నాయి. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ ఇదే.