News December 13, 2025

సినిమా అప్‌డేట్స్

image

✦ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్
✦ నేడు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ రిలీజ్ డేట్ ప్రకటనతోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
✦ నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో $100K మార్క్‌ను దాటేసిన ‘రాజాసాబ్’
✦ తెలుగులోకి రీమేక్ కానున్న హాట్‌స్టార్ హిందీ వెబ్‌సిరీస్ ‘ఆర్య’.. ప్రధాన పాత్రలో కాజల్?

Similar News

News March 3, 2026

స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే..: CM

image

TG: మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. పిల్ల‌ల‌కు పోషకాహారం అందాలని, అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి, డ్ర‌గ్స్‌, ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే అందుకు ఆయా విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాలే బాధ్య‌త వ‌హించాలని స్పష్టం చేశారు. సైకాలజిస్టులను నియమించుకోవాలని సూచించారు.

News March 3, 2026

ఇండియాను విడిచి వెళ్తా: ఇరానియన్ నటి

image

భద్రతా కారణాల వల్ల తాను ఇండియాను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు ఇరానియన్ మోడల్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మందన కరిమి వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు బయటపెడతానన్నారు. ‘ఇరాన్‌లో నియంతృత్వంపై మాట్లాడటం. వాస్తవాలు చెప్పడం వల్ల చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నాకు ప్రభుత్వం/మీడియా నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు అనిపించడం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 3, 2026

ఒకప్పుడు బంగారాన్ని ఇలా కొలిచేవారు!

image

పూర్వం బంగారాన్ని వీసం, తులం, కాసు, సవర వంటి విధానాల్లో కొలిచేవారు. అప్పట్లో వీసం (19 మి.గ్రా) కనిష్ఠ కొలతగా ఉండేది. 5 వీసాలు = ఒక గురివింద గింజ (95mg). 2 గురివింద గింజలు= 1 కాణి (185mg). 2 కాణిలు= 1 అర్ధణా (365mg). 2 అర్ధణాలు =1 అణా(730mg). 2 అణాలు= 1 బేడ(1.46G). 2 బేడలు= 1 పావు(2.9G). 4 బేడాలు = అరతులం(5.84గ్రా). 2 అరతులాలు= తులం (11.66గ్రాములు). అలాగే సవర/ కాసు అంటే 8గ్రాముల బంగారం అని అర్థం.