News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

Similar News

News March 4, 2026

ఆనాటి ‘రంగుల’ లోకాన్ని మిస్ అవుతున్నారా?

image

పురోహితుల సూచనతో చాలా ప్రాంతాల్లో హోలీ పండుగను ఇవాళే జరుపుకుంటున్నారు. అయితే చాలాచోట్ల ఒకప్పటి సందడి కనిపించట్లేదు. ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు, పెద్దలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్లు. ఒళ్లంతా రంగులు పూసుకున్నా మనసు నిండా స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ గడిపిన ఆ రోజులు మళ్లీ రావు. మీరూ ఒకప్పటి హోలీని మిస్ అవుతున్నారా? COMMENT

News March 4, 2026

ఇరాన్ యుద్ధానికి ₹18.8 లక్షల కోట్లు..

image

ఇరాన్‌పై దాడుల్లో తొలి 24 గంటల్లోనే US దాదాపు ₹6,900 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం నెల రోజులు సాగితే మొత్తం ఖర్చు ₹18.87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. భారీ విమానవాహక నౌక ‘USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ నిర్వహణకే రోజుకు ₹58 కోట్లు ఖర్చవుతోందని సమాచారం. చమురు ధరలు పెరగడం, ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల USకు అదనంగా మరో $115 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

News March 4, 2026

ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి <<>>కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 2 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), MCom అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in