News September 24, 2025
సినిమా పైరసీలో నెల్లూరు జిల్లా యువకుడి ప్రమేయం..?

సినిమా పైరసీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. సీతారాంపురం మండలానికి చెందిన ఓ యువకుడు సినమా పైరసీ చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీతారాంపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సదరు యువకుడికి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. సీతారాంపురం యువకుడితో పాటు మరికొందరు పాత్ర పైరసీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 24, 2025
నెల్లూరు జిల్లా DSC అభ్యర్థులకు గమనిక

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో గురువారం నియామక పత్రాలు అందజేస్తామని నెల్లూరు డీఈవో బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నేటి సాయంత్రం 4 గంటలలోపు గొలగమూడి ఆశ్రమం వద్దకు రావాలని సూచించారు. ఇక్కడి నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.
News September 23, 2025
నెల్లూరు: ‘నమ్మకంగా ఉంటూ నగదు కొట్టేశాడు’

నెల్లూరు బాలాజీ నగర్ పరిధిలోని కలికి కోదండరామిరెడ్డి అనే వ్యాపారవేత్త వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బుకొట్టేసిన డ్రైవర్ మహేశ్ నాయక్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.2 కోట్ల 10 లక్షలు దొంగలించగా అతనివద్ద నుంచి రూ.కోటి 96 లక్షల 29వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు, అతనికి సహకరించినవారివద్ద నుంచి 10 లక్షల నగదుతోపాటు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర DSP సింధుప్రియ తెలిపారు.
News September 23, 2025
112కు కాల్.. ప్రాణాలు కాపాడిన కోవూరు పోలీసులు

112 కి వచ్చిన ఫోన్ కాల్‌కి స్పందించిన కోవూరు పోలీసులు సోమవారం ఒకరి ప్రాణాలను కాపాడారు. కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన కందల వంశీ (26) మానసిక స్థితి సరిగా లేక తను చనిపోతున్నానని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోమని తన అక్క స్వరూపకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని స్వూరూప 112కు తెలియజేశారు. వెంటనే స్పందించిన కోవూరు సీఐ వి.సుధాకర రెడ్డి రైలు పట్టాలపై ఉన్న వంశీని కాపాడారు.