News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News February 7, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌కు 70 వేల బస్తాలు..!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 70 వేల బస్తాలు మార్కెట్‌కు రావడంతో షెడ్‌లు అన్ని కళకళలాడాయి. గురువారం జెండా పాట క్వింటాకు రూ.14,025 ధర పలకింది. గత ఏడాది రూ.20వేలకు పైగా ధర లభిస్తే.. ఇప్పుడు రూ.14వేలుగా ఉంది. ఈ ధర గత ఏడాది తాలు మిర్చికి వచ్చిన ధర కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి మిర్చి మార్కెట‌కు వచ్చింది.

News February 7, 2025

ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

image

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. 

News February 7, 2025

ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

image

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!