News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

Similar News

News November 9, 2025

విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News November 9, 2025

15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్‌సిగ్నల్?

image

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్‌(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.

News November 9, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ ఇదే..!

image

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తీకమాసం మూడవ ఆదివారం సందర్భంగా అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.