News January 14, 2026

సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

image

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Similar News

News February 21, 2026

కర్నూలు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయంతో మహిళపై వ్యామోహం పెంచుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పత్తికొండలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అశోక్(26)కు పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని నమ్మబలికిన యువకుడు పత్తికొండకు వచ్చాడు. అనంతరం తనతో రావాలంటూ మహిళను వేధించగా ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2026

లొంగు‘బాట’లో దేవ్‌జీ?

image

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.

News February 21, 2026

ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

image

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/