News December 17, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: SP

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ సరళిని, అలాగే బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ తగిన సూచనలు చేశారు.
Similar News
News December 18, 2025
ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

<
News December 18, 2025
అన్నమయ్య: TDP తీర్థం పుచ్చుకున్న MLA అభ్యర్థి

అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె మండలం బాగంపల్లెకి చెందిన విశ్వనాథనాయక్ TDP తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో గురువారం మంత్రి మండిపల్లి క్యాంపు కార్యాలయంలో అయన మంత్రిని కలిశారు. మంత్రి స్వయంగా టీడీపీ కండువా కప్పి విశ్వనాథనాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
News December 18, 2025
ఆదిలాబాద్: హస్తం హవా.. ముగిసిన పంచాయతీ సమరం

ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతలుగా 1,505 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో కాంగ్రెస్ 604 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. BRS 351తో రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకు 257 సర్పంచ్ స్థానాలు దక్కాయి. 294 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధిష్ఠానంలో ఉండడంతో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులకు కలసి వచ్చినట్లు తెలుస్తోంది.


