News April 4, 2025
సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
Similar News
News April 11, 2025
విజయనగరం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లాలో ఫస్టియర్ 20,902 మంది, సెకండియర్ 18,384 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
విజయనగరం: రైలులో ప్రయాణిస్తూ.. మహిళ మిస్సింగ్

ఈ నెల 4వ తేదీన ట్రైన్ డిబ్రుగఢ్ – వివేక్ ఎక్స్ ప్రెస్ (22503) రైలులో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తూ ఓ మహిళ మిస్సైంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రైన్ వచ్చినప్పటికే మహిళ తప్పిపోయిందని పశ్చిమ బెంగాల్ డినజ్పూర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ దాస్ అనే యువకుడు విజయనగరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 11, 2025
విజయనగరం : నేడు పిడుగులతో కూడిన వర్షాలు

విజయనగరం జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి.