News September 24, 2024
సిమెంట్ రోడ్ల నిర్మాణానికి MLA సునీత పూజ

ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
News November 11, 2025
వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.